మల్లాపూర్ మండలం గుండంపల్లికి చెందిన బృహత్ పల్లి ప్రకృతి వనంలోని కరెంట్ మోటార్ దొంగతనానికి గురైనట్లు పంచాయతీ కార్యదర్శి ఎన్.నారాయణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. గుండంపల్లి గ్రామ శివారులోని బృహత్ పల్లె ప్రకృతి వనంలో చెట్లకు నీరు పట్టడానికి మోటర్ను ఏర్పాటు చేశారు. ఈరోజు వెళ్లి చూడగా మోటార్ లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని ఎస్సైకి ఫిర్యాదు చేశారు.