అంగన్వాడి సెంటర్‌లో VHSND ప్రోగ్రాం
NEWS Nov 06,2024 04:44 pm
మెట్‌పల్లి: అంగన్వాడి సెంటర్లో ప్రతి నెల నిర్వహించే విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ డే కార్యక్రమంలో భాగంగా మెట్‌పల్లి ఇంద్రనగర్ అంగన్వాడి సెంటర్‌లో అంగన్వాడి సూపర్వైజర్ ప్రతిభ.. అంగన్వాడి పిల్లలందరికీ ఎత్తు, బరువులు సేకరించారు. దాంతోపాటు పిల్లలకు కోడిగుడ్లను, బాల అమృతంను అందించారు. తదనంతరం గర్భిణీలకు తల్లులకు కిషోర బాలికలకు పోషకాహారంపై, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ సిహెచ్ విజయలక్ష్మి, ఆయ పద్మ, పిల్లలు, తల్లులు పాల్గొన్నారు.