స్కూల్ నీటి కొరతను తీర్చిన గ్రామస్తులు
NEWS Nov 02,2024 12:10 pm
మల్లాపూర్ మండలంలోని రేగుంట ప్రభుత్వ పాఠశాలలో ఫిల్టర్ వాటర్ మెషిన్ పాడై పోయింది. రిగ్గు మోటార్ చెడి పోవడంతో తాగడానికి వాష్ రూం ఇతర అవసరాలకు నీరు లేక ప్రాథమిక పాఠశాల, హైస్కూల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. దీంతో పలువురు గ్రామస్తులు విరాళాలు సేకరించి, రిగ్గు బండితో రిపేర్ చేయించి, ఫిల్టర్ వాటర్ మెషిన్ బాగు చేయించి పైప్ లైన్ నల్ల కలెక్షన్‌లు బాగు చేయించారు. 21,000 ఖర్చు చేయించి విద్యార్థులకు నీటి సౌకర్యాన్ని కల్పించారు.