ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ఏడు పదుల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. తన మనవరాలి పెళ్లి సంగీత్ కార్యక్రమంలో డ్యాన్స్ ని ఇరగదీశారు. వైట్ కలర్ సూటుబూటులో మరికొందరితో కలిసి ఆయన అదిరిపోయే స్టెప్పులు వేశారు. తన మనవరాలు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహం ఈ నెల 27న జరగనుంది. ఈ పెళ్లి సంగీత్ కార్యక్రమంలో ఆయన డీజే టిల్లు పాటకు డ్యాన్స్ చేశారు.