నిందితులను కఠినంగా శిక్షించాలి
NEWS Oct 15,2024 05:26 pm
కోరుట్ల: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో దేవత విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కోరుట్ల సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కి వినతి పత్రం అందించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ విధ్వంసం జరిగిందని, మన దేశంలో అనేకసార్లు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని అన్నారు.