కేటీఆర్‌పై కేసు నమోదు
NEWS Oct 15,2024 05:13 pm
TG: మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో కేసు నమోదైంది. మూసీ ప్రాజెక్టును రూ.1.5 లక్షల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతోందని, అందులో రూ.25,000 కోట్లు ఢిల్లీకి పంపుతుందని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ ఫిర్యాదుతో BNS 352, 353(2), 356(2) చట్టాల కింద KTRపై పోలీసులు కేసు నమోదు చేశారు.