ఫొటోలు మార్ఫింగ్ కేసు ఇద్దరు అరెస్ట్
NEWS Oct 15,2024 04:54 pm
మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు ఫొటోల మార్ఫింగ్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోనాపూర్ మాజీ సర్పంచ్ దేవన్న, జగిత్యాల జిల్లా రాయికల్ వ్యాపారి మహేశ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల మెదక్ జిల్లాలో ఓ కార్యక్రమంలో కొండా సురేఖ మెడలో రఘునందన్ మర్యాదపూర్వకంగా ఓ చేనేత కండువా వేశారు. ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసిన నిందితులు అసభ్యకరరీతిలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. .