పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
NEWS Oct 15,2024 05:39 pm
అనంతపురము జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు ఇటుకలపల్లి పోలీసులు పేకాట స్థావరంపై దాడులు చేశారు. సి.ఐ. హేమంత్ కుమార్ పర్యవేక్షణలో, ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కందుకూరు గ్రామ పొలాల్లో దాడులు నిర్వహించి ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వీరి నుండీ రూ. 30,190 నగదు, 5 బైకులు,7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.