పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
NEWS Oct 15,2024 04:45 pm
మల్లాపూర్ మండలం వేంపల్లి వెంకట్రావుపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2008 - 09 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంను నిర్వహించారు. ఒకరినొకరి ఆప్యాయంగా పలకరించుకుంటూ బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. యోగ క్షేమాలను తెలుసుకుంటూ గత స్మృతులను నెమరు వేసుకున్నారు. ఆటపాటలతో సంతోషంగా గడిపారు.