చెక్కు అందజేసిన ప్రభుత్వ విప్
NEWS Oct 15,2024 01:40 pm
సిరిసిల్ల: సిరిసిల్లలోని గణేష్‌నగర్‌కు చెందిన కోడం హరికిషన్ కొడుకు బోన్ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నాడు. తమ కుమారుడిని ఆదుకోవాలని కలెక్టర్ కు విన్నవించారు. దీంతో స్పందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రూ.1 లక్ష 42 వేల చెక్కు మంజూరు చేయగా, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.