కరెంట్ షాక్ తగిలి మేకపోతు మృతి
NEWS Oct 15,2024 01:43 pm
కథలాపూర్ మండల కేంద్రంలోని కోట గంగాధర్ కు చెందిన మేకపోతు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. కథలాపూర్ మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కెనాల్ కాల్వ వద్ద మేకపోతు చనిపోయినట్లు తెలిపారు. కోట గంగాధర్ మాట్లాడుతూ దీని విలువ 13 వేల వరకు ఉంటుందని ప్రభుత్వం తమని ఆదుకోవాలని, మేకలు మేపుకుంటూ బతికే జీవన సాగిస్తున్నారని అన్నారు. మాజీ సర్పంచ్ కన్నడ శంకర్ పావని ప్రభుత్వం వీరికి నష్టపరిహరం అందించాలని కోరారు.