మంత్రి చేతుల మీదుగా GP ప్రారంభం
NEWS Oct 15,2024 01:45 pm
భద్రాద్రి కొత్తగూడెం: బూర్గంపాడు మండల పరిధిలోని తాళ్లగోమ్మూరులో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే పాయంతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే పాయం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.