బాణాసంచా దుకాణాలకు అనుమతి: CP
NEWS Oct 15,2024 01:14 pm
ఖమ్మం జిల్లాలో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకునే వ్యాపారస్తులు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కోరారు. ఈనెల 25 సాయంత్రంలోపు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకొని, అనుమతి పొందాలని సూచించారు. పోలీస్ శాఖ, నగర పాలక శాఖ, అగ్నిమాపక శాఖలు నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే అనుమతితో దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.