రాజ్‌నాథ్ కాళ్లు మొక్కిన బండి సంజయ్
NEWS Oct 15,2024 11:57 am
కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాళ్లు మొక్కారు. వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో రాడార్ శంకుస్థాపన కార్యక్రమం కోసం రాజ్‌నాథ్ సింగ్ వచ్చారు. హైదరాబాద్ చేరుకున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఘన స్వాగతం పలికారు. కిషన్ రెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. రాజ్‌నాథ్‌కి శాలువా కప్పిన బండి సంజయ్.. అంతకుముందు ఆయన పాదాలను తాకారు.