పెండింగ్ స్కాలర్షిప్ విడుదల చేయాలని ర్యాలీ
NEWS Oct 15,2024 11:50 am
రామాయంపేట మండల కేంద్రంలో స్నేహ కళాశాల విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న డిగ్రీ విద్యార్థుల ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అంబేద్కర్ విగ్రహానికి సమర్పించారు. పెండింగ్ ఉపకారవైతనాల కోసం డిగ్రీ కళాశాలలో మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.