కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుంటాం
NEWS Oct 15,2024 11:24 am
వేంసూరు: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ప్రైవేట్ పరం చేయడం సరి కాదని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ అన్నారు. మర్లపాడు గ్రామంలో మండల హౌస్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. కార్మిక సంక్షేమ బోర్డును సాధించడం కోసం ఆనాడు కార్మికులు నిరంతరం కృషి చేశారని చెప్పారు. దీనిపై పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.