టేక్మాల్ మండల కేంద్రంలో వీధి కుక్కల బెడదా ఎక్కువయ్యాయని వాటిని అరికట్టే విదంగా చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన దొడ్ల సంతోష్ గ్రామ కార్యదర్శి రాకేష్ కుమార్ కు వినతి పత్రాన్ని అందచేశారు. ఈ సందర్బంగా సంతోష్ మాట్లాడుతూ.. గ్రామంలో వీధి కుక్కలు రోడ్లపై వెళ్లే వారిపై దాడి చేస్తున్నాయని, గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని చెప్పారు. అధికారులు వీధి కుక్కలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.