జగిత్యాల: డాక్టర్లకు రక్షణ కల్పించాలి
NEWS Oct 15,2024 11:03 am
జగిత్యాల: దేశంలో వైద్యులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కలకత్తా ఆర్ జి కర్ హాస్పిటల్‌లో జరిగిన వైద్యురాలి హత్యాచారంపై ఇప్పటికీ నిండితుడికి శిక్ష పడలేదన్నారు. వెంటనే కలకత్తా అత్యాచార ఘటన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వాలు డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.