తల్లాడాలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట
NEWS Oct 15,2024 11:04 am
తల్లాడ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నేత తాండ్ర వినోద రావు పాల్గొన్నారు. స్వామివారికి వినోద్ రావు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయాల ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలను నేటి తరానికి అందించవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు.