రామయ్య సన్నిధిలో శివసేనా రెడ్డి
NEWS Oct 15,2024 08:03 am
భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని తెలంగాణ స్టేట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి దర్శించుకున్నారు. ముందుగా అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు శివసేనారెడ్డికి స్వామివారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.