అంజన్నను దర్శించుకున్న అరికపూడి
NEWS Oct 15,2024 07:55 am
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామిని PAC చెర్మన్ అరికపూడి గాంధీ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దర్శించుకున్నారు. గాంధీ జన్మదినం సందర్బంగా కొండగట్టుకు విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆయనకు అర్చకులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.