అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
NEWS Oct 15,2024 06:25 am
ఖమ్మంలోని 48వ డివిజన్లో అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. రూ. కోటితో డ్రైన్ పనులకు ప్రారంభించి త్వరగా అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. వర్షకాలంలో సరియైన డ్రైన్లు లేక వరదనీరంతా ఈ ప్రాంతంలో పారుతుంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సమస్యను గుర్తించిన మంత్రి నూతన డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు.