ప్రభుత్వ పాఠశాలలో ఆకతాయిల విధ్వంసం
NEWS Oct 15,2024 05:39 am
రాయికల్ మండలం తాట్లవాయి గ్రామంలో ని ప్రాథమిక, ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో గుర్తుతెలియని ఆకతాయిలు విధ్వంసం సృష్టించారు, 8 ఫ్యాన్లను, బెంచీలను, తరగతి గదిలో డోర్లను ధ్వంసం చేశారు. దసరా సెలవుల అనంతరం నేడు స్కూల్ ఓపెన్ చేసి చూస్తే అన్ని ధ్వంసమై ఉన్నాయన్నారు. లక్షకుపైగా నష్టం జరిగినట్టు ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో విచారణ జరుపుతున్నారు.