కెనడా నుంచి భారత్ దౌత్యవేత్తలు వెనక్కి
NEWS Oct 15,2024 04:45 am
కెనడాలోని భారత హైకమిషనర్, దౌత్యవేత్తలను, అధికారులకు రక్షణ లేదని, వెనక్కి పిలిపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ సహా పలువురు దౌత్యవేత్తలను అనుమానితులుగా కెనడా పేర్కొంది. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని కెనడా దౌత్యాధికారికి భారత్ తేల్చి చెప్పింది.