ఘనంగా బతుకమ్మ వేడుకలు
NEWS Oct 15,2024 03:56 am
మెట్‌పల్లి పట్టణంలోని వట్టి వాగు వద్ద బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మండలంలోని, వేంపేట్, వెల్లుల్ల, ఆత్మకూర్, ఆత్మనగర్, జగ్గసాగర్ గ్రామాల్లోను బతుకమ్మ సంబరాలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. వివిధ రకాల పువ్వులతో బతుకమ్మలను అందంగా రూపొందించి బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటం ఆడుతూ డీజే చప్పుల మధ్య బతుకమ్మలను తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. ఒకరికొకరు వాయినాలను అందజేసుకున్నారు.