రావి ఆకుపై అబ్దుల్ కలాం చిత్రం!
NEWS Oct 15,2024 03:58 am
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణానికి చెందిన లీఫ్ ఆర్టిస్టు గుండు శివకుమార్ రావి ఆకుపై మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిత్రం రూపొందించారు. ఈరోజు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని రావి ఆకుపై చిత్రం చిత్రించి శ్రద్ధాంజలి ఘటించారు. శివకుమార్ ప్రతిభకు పలువురు అభినందించారు.