వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: జగ్గారెడ్డి
NEWS Oct 14,2024 07:51 am
TG: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ MLA జగ్గారెడ్డి ప్రకటించారు. తన భార్య నిర్మలారెడ్డి లేదా తన అనుచరుడు ఆంజనేయులతో పోటీ చేయిస్తానని తెలిపారు. ‘దీనిపై CM రేవంత్, మహేశ్ కుమార్ గౌడ్‌తో చర్చిస్తా. గత ఎన్నికల్లో BRS నేతలు ఓటుకు రూ.2వేలు ఇచ్చి నన్ను ఓడించారు. ఓడినా ప్రజల మధ్యే ఉంటూ అభివృద్ధికి నిధులు తెస్తా’ అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.