బార్‌ను తొలగించాలని ప్రజావాణిలో ఫిర్యాదు
NEWS Oct 14,2024 07:48 am
జగిత్యాల పట్టణంలోని బాలాజీ బార్ & రెస్టారెంట్‌ని తొలగించాలని ప్రజావాణిలో కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు రాధాకృష్ణ రెసిడెన్సి వాసులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగడి బజార్ వద్ద జనావాసాలలో ఉన్న బార్ వల్ల చుట్టు పక్కల ఇండ్లలో ఉన్నవాళ్ళకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బార్‌కి వచ్చేవారు మద్యం సేవించి రోడ్లపైనే మూత్ర విసర్జన చేస్తున్నారని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు.