గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య
NEWS Oct 14,2024 06:25 am
కోరుట్ల పట్టణంలో కల్లూర్ రోడ్డు రైల్వే బిడ్జివద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం అటుగా వెళుతున్న వ్యక్తులకు మృతదేహం కనిపించటంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఏ ప్రాంతానికి చెందినవాడు అనే కోణంలో విచారణ చేపట్టారు.