గంగమ్మ వాగు వద్ద లారీ బోల్తా
NEWS Oct 14,2024 06:29 am
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గంగమ్మ వాగు వద్ద బ్రిడ్జి నిర్మాణం లేకపోవడం వలన తాత్కాలిక రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు కొట్టుకుపోయింది. రామారెడ్డి గ్రామ ప్రజలు, వివిధ పార్టీ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు అంబాయి ప్రసాద్ ఆధ్వర్యంలో తాత్కార్కు రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డుపై టూ వీలర్, త్రీ వీలర్ మాత్రమే వెళ్లే పరిస్థితి. కానీ నిన్న రాత్రి లారీ అక్కడి నుంచి వెళ్లడంతో రోడ్డు సరిగా లేక బోల్తా పడింది.