రూ. 500 కోట్లు దాటిన ‘దేవర’ వసూళ్లు
NEWS Oct 13,2024 06:46 pm
ఎన్టీఆర్ - కొరటాల శివ మూవీ ‘దేవర’.. తాజాగా రూ.500 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుంది. 16 రోజుల్లో రూ.500 కోట్ల వసూళ్లు మార్క్ దాటేసిందని నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు. ‘దేవర’ రెండో భాగం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2’ అనే హిందీ సినిమా చేస్తున్నాడు. మరో 2 నెలల్లో ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమా షూటింగ్‌కి వెళతాడు. ఈ 2పూర్తయిన తర్వాతే ‘దేవర 2’ వచ్చే అవకాశం.