RSS సంఘం వ్యవస్థాపక దినోత్సవం
NEWS Oct 13,2024 02:08 pm
కొత్తగూడెం: రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆదివారం కొత్తగూడెం పట్టణం రామా టాకీస్ ఏరియాలో ఘనంగా జరిపారు. పోలింగ్ బూత్ నంబర్ 168లో బాల బాలికలకు యోగ పోటీలను ప్రముఖ యోగా గురువు గుమలాపురం సత్యనారాయణ నిర్వహించారు. అనంతరం గెలుపొందిన విజేతలకు యూపీఏ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్బీ రత్నాకర్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.