భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటన ద్వారా తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు సమర్పించే బాధ్యులు రాతపూర్వకంగా సమర్పించాలని సూచించారు. ఉదయం 10:30కు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని వెల్లడించారు.