పులికాంత చరితర్థ్‌ను సన్మానించిన ఎమ్మెల్యే
NEWS Oct 13,2024 01:27 pm
జాతీయస్థాయి బేస్ బాల్ పోటీల కోసం పంజాబ్‌లో ఆడి వచ్చిన పులికాంత చరితర్థ్‌ను వేములవాడ ఎమ్మెల్యే ,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని, అప్పుడే బుద్ధిబలం పెరుగుతుందన్నారు. చరితార్థ్ బేస్‌బాల్‌తో పాటు కరాటేలో కూడా బ్లాక్ బెల్ట్ తెచ్చుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు, చరితర్థ్ తండ్రి ప్రమోదును అభినందించారు. సత్యనారాయణ, శేఖర్, లింగారావ్, నారాయణరెడ్డి, ప్రసాద్, మహేందర్ రెడ్డి, అనంత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.