బావి నీరు తాగి 50 మంది అస్వస్థత
NEWS Oct 12,2024 07:33 am
నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావుపేట గ్రామంలో కలుషిత నీరు తాగి సుమారు 50 మంది అస్వస్థకు గురయ్యారు. బావిలోని నీరు తాగిన 2 బీసీ కాలనీలకు చెందిన పలువురు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. 50 మంది అస్వస్థకు గురికాగా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఒకరిని సంగారెడ్డి ఆస్పత్రికి, ఇద్దరిని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.