దుర్గాదేవి లడ్డూ వేలం రూ. 33,616
NEWS Oct 12,2024 07:30 am
మల్లాపూర్ దుర్గాదేవీ ఆలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. దుర్గాదేవి అమ్మవారి చేతిలో పెట్టిన లడ్డూకు నిర్వాహకులు వేలం పాట నిర్వహించారు. లడ్డూను మండల కేంద్రానికి చెందిన తోట రాజశేఖర్ రూ.33,616 దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో దుర్గాదేవి ఆలయ నిర్వాహకులు, స్వాములు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.