విజయవాడ: దసరా ఉత్సవాల్లో భాగంగా ఇవాళ దుర్గమ్మ జగన్మాత రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నేటితో ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రోత్సవాలు ముగియనున్నాయి. భక్తులను రాత్రి 11 గంటల వరకు ఆలయంలోకి అనుమతిస్తారు. చివరి రోజు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు.