LIC బోనస్ పేరుతో 60 వేలు కొట్టేశాడు
NEWS Oct 12,2024 04:01 am
కథలాపూర్ మండలానికి చెందిన బాధితుడికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఎల్ఐసీ ఏజెంట్ గా పరిచయం చేసుకున్న అజ్ఞాత వ్యక్తి బోనస్ వచ్చిందంటూ బాధితుడిని నమ్మించాడు. అమౌంట్ కూడా జమ కావాలంటే తాను చెప్పే సూచనలు పాటించాలని నమ్మించి, ఫోన్ పే ద్వారా 60 వేల రూ. కొట్టేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి డబ్బులు పోయినట్టు మెసేజ్ రావడంతో బాధితుడు మోసపోయినట్టుగా తెలుసుకొని. వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ కు, కథలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.