మెట్ పల్లి పట్టణంలోని ఆదర్శ్ నగర్ లో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద కుంకుమ పూజ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. అధికసంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించి మొక్కులను చెల్లించుకున్నారు. కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాతలకు సిల్వర్ కాయిన్ ను అందజేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.