అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్సీ
NEWS Oct 11,2024 09:35 am
దేవీ నవరాత్రుల సందర్భంగా మల్యాల మండల కేంద్రంలో, ముత్యంపేట గ్రామంలో కొలువుదీరిన అమ్మవార్లను ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రసాద్, రవితేజ, సత్యనారాయణ, వెంకటేషం, నరేష్, హరినాథ్, మారుతి, సాయి తదితరులు పాల్గొన్నారు.