టాటా ట్రస్టుల చైర్మన్‌గా నోయల్ టాటా
NEWS Oct 11,2024 08:45 am
టాటా ట్రస్టుల నూతన చైర్మన్‌గా నోయెల్ టాటా నియామకం అయ్యారు. రతన్ టాటా మరణించిన తరువాత శుక్రవారం ముంబైలో ట్రస్ట్ బోర్డు సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రతన్ టాటా సవతి తల్లి సిమోన్ కుమారుడు, రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా టాటా ట్రస్టుల కొత్త చైర్మన్ గా ఎంపికయ్యారు. బోర్డు సభ్యులు అతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటికే టాటా గ్రూపులోని పలు కంపెనీల్లో వివిధ కీలక హోదాల్లో నోయెల్ టాటా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.