మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గోలిపర్తి గ్రామానికి చెందిన రొయ్యల రాజు అనే యువకుడు ఇటీవల డీఎస్సీలో ఎస్జీటీ గా ఉద్యోగం పొందడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలోని దుర్గమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉద్యోగం సాధించిన రొయ్యల రాజులు గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మల్యాల కిషన్, బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.