బతుకమ్మపైన సీఎం రేవంత్ చిత్రపటం
NEWS Oct 11,2024 04:47 am
సీఎం రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని బతుకమ్మపై చిత్రించి చాటుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన గోగురి శ్రీనివాస్ రెడ్డి దంపతులు సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా బతుకమ్మపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం వేసి బతుకమ్మ ఆడుతున్న మహిళలను ఆకట్టుకున్నారు. గోగురి శ్రీనివాస్ రెడ్డి దంపతులు అభినందనలు తెలిపారు.