ఘనంగా సద్దుల బతుకమ్మ
NEWS Oct 10,2024 05:12 pm
కామారెడ్డి జిల్లా కేంద్రంలో HM TV మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ వేడుకలో మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణ మహిళలు అధిక సంఖ్యలో బతుకమ్మలు తీసుకు వచ్చి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ విజేతలకు షబ్బీర్అలీ, గడ్డం ఇందు ప్రియ బహుమతులు అందజేశారు. కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.