మెట్‌పల్లి: బతుకమ్మ సంబరాలు
NEWS Oct 10,2024 05:09 pm
మెట్‌పల్లి అరపేట అమరవీరుల స్థూపం వద్ద ఇందిరానగర్, తులానగర్ కాలనీ వాసులు సద్ధుల బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఆట పాటలతో ఆడిపాడారు. మహిళ సంఘాల లీడర్లు, కనకవ్వ, కళావతి, రాధా, అంజమ్మ, గంగు కవిత, లక్ష్మి, జల, శాంతి, లక్ష్మి, పవిత్ర కౌన్సిలర్ లంక గంగాధర్, రాములు స్వామి, రవి కుమార్, రాజాం, గంగారాం, వెంకటి, ధర్మేందర్, రాజు, శ్రీను, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.