ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని జగిత్యాల జిల్లా SP అశోక్ కుమార్ సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు SP. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా అధికారులు భరోసా కల్పించాలన్నారు. బాధితులకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ ని సంప్రదించవచ్చుని తెలిపారు.