హన్మాజీపేట PHC తనిఖీ చేసిన కలెక్టర్
NEWS Oct 10,2024 10:19 am
వేములవాడ: జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది హాజరు కోసం బయోమెట్రిక్ పరికరాలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC)ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ, సిబ్బంది హాజరు, రక్త పరీక్షల రిజిస్టర్ ను పరిశీలించారు. దవాఖాన వైద్యులు, సిబ్బంది ప్రతిరోజూ సమయ పాలన పాటించాలని సూచించారు. అందుబాటులో ఉండి రోగులకు సేవలు అందించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట వైద్య సిబ్బంది పాల్గొన్నారు.