దసరా ఏర్పాట్లను పరిశీలించిన DSP
NEWS Oct 10,2024 09:18 am
జగిత్యాల జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ వద్ద శనివారం రోజు జరిగే దసరా ఏర్పాట్లను జగిత్యాల డిఎస్పి రఘు చందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.. జమ్మిగడ్డ వద్ద జరిగే దసరా వేడుకలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ నుండి భద్రతాపరంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని తెలిపారు. పండగను ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవాలని కోరారు.