కంటి చూపు లేకపోయినా..
NEWS Oct 10,2024 09:07 am
టేక్మాల్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన యాదయ్య 2015లో డైట్, 2023 లో బీఈడీ పూర్తి చేశారు. ప్రస్తుతం రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. డీఎస్సీలో 3 విభాగాల్లో ఇతరుల సాయంతో పరీక్ష రాశాడు. తెలుగు భాషోపాధ్యాయునిగా, ఎసీటీ, ఎస్ఏ సాంఘిక శాస్త్రంలో అన్నిటిలో అతను ఉద్యోగం సాధించాడు. అతనికి కంటి చూపు లేకపోయినా సంకల్ప బలంతో ముందుకు సాగి, అనుకున్నది సాధించారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఆయన కర్తవ్యం అని చెప్పారు.