గుండెల్ని తడిమేస్తున్న యంగ్‌ఫ్రెండ్ సందేశం
NEWS Oct 10,2024 07:09 am
రతన్ టాటా యంగ్ ఫ్రెండ్, అసిస్టెంట్ శంతనూ నాయుడి సోషల్ మీడియా పోస్ట్ గుండెల్ని తడిమేస్తోంది. ‘మా స్నేహబంధానికి లోటు ఏర్పడింది. దానిని పూడ్చుకుంటూ నేనిప్పుడు జీవితం గడపాలి. ప్రేమకు దు:ఖమే మూల్యం. గుడ్‌బై మై డియర్ లైట్ హౌస్’ అన్న పోస్ట్ వైరలైంది. వయసు రీత్యా 56 ఏళ్ల తేడా ఉన్న వీరిని జంతువులపై ప్రేమే కలిపింది. అర్ధరాత్రి వీధికుక్కల్ని కాపాడుతున్న శంతనూను 2014లో టాటా తన ఆఫీస్‌కు GMగా నియమించారు.